
జనరల్

సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష సోమవారం 9వ రోజుకు చేరుకుంది. దీక్ష కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితిపై మద్దతుదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించాలని వారు కోరుతున్నారు.
సీజేపీ (Campaign for Justice and Peace) తమ అధికారిక ఎక్స్ ఖాతాలో వెల్లడించిన ఆరోగ్య వివరాల ప్రకారం, సోనం వాంగ్‌చుక్ రక్తపోటు 107/67 mmHgగా, రక్తంలో చక్కెర స్థాయి 72 mg/dLగా నమోదైంది. నిరాహార దీక్ష ప్రారంభమైనప్పటి నుంచి ఆయన మొత్తం 6.9 కిలోల బరువు తగ్గినట్లు ఆ సంస్థ వెల్లడించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!