
సినిమాలు

మంత్రి జూపల్లి కృష్ణారావు తెలంగాణ రాష్ట్ర అప్పుల అంశంపై కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులకు బహిరంగ లేఖ రాశారు. తాను వెల్లడించిన అప్పుల లెక్కలు తప్పని రుజువు చేయాలని సవాల్ విసిరిన ఆయన, ఇప్పటికీ తన రాజీనామా నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. తన లేఖకు రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలని కూడా కోరారు.
సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సాయంత్రం 5 గంటలకు బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి జూపల్లి ప్రకటించారు. తాను చెప్పిన లెక్కలు తప్పని నిరూపిస్తే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా అని ప్రశ్నించారు. అప్పుల లెక్కలపై బీఆర్ఎస్ చేసిన వాదనలు తప్పని తేలితే ఏం చేస్తారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తాను వెనక్కి తగ్గే వ్యక్తిని కాదని, నిరాధార ఆరోపణలు చేస్తే సహించబోనని స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!