

బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు తనపై వచ్చిన ‘క్షుద్రపూజలు’ ఆరోపణలపై దాఖలు చేసిన పరువునష్టం కేసులో నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ఎదుట హాజరయ్యారు. ఈ కేసులో టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేశ్‌కుమార్ గౌడ్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌లపై హరీశ్‌రావు ఫిర్యాదు చేశారు. తెలంగాణలో వర్షాలు పడకుండా తాను క్షుద్రపూజలు చేశానంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపించారని, అవి తన పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. కోర్టులో తన వాంగ్మూలాన్ని నమోదు చేసిన హరీశ్‌రావు.. మహేశ్‌కుమార్ గౌడ్, అద్దంకి దయాకర్ తనపై ఆధారరహిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. క్షుద్రపూజల అంశంపై వారు చేసిన వ్యాఖ్యలతో తన ప్రతిష్ఠ దెబ్బతిందని తెలిపారు. ఈ ఆరోపణలు అవాస్తవమని పేర్కొంటూ ఆయన న్యాయపోరాటం చేస్తున్నారు. కాగా, కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలు ప్రస్తుతం న్యాయస్థానంలో విచారణలో ఉన్న అంశం కాగా, వాటిపై కోర్టు తుది నిర్ధారణ ఇవ్వలేదు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!