
రాజకీయాలు

వాహన రిజిస్ట్రేషన్ నిబంధనలను సులభతరం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రతిపాదనను పరిశీలిస్తోంది. దీని ప్రకారం, ఒక రాష్ట్రంలో రిజిస్టర్ అయిన వాహనాన్ని మరో రాష్ట్రంలో మూడు సంవత్సరాల వరకు అదే రిజిస్ట్రేషన్‌తో ఉంచుకునే అవకాశం కల్పించనుంది. ఉద్యోగం, విద్య తదితర కారణాలతో రాష్ట్రాలు మారే వారికి ఇది ఉపశమనం కలిగించే నిర్ణయంగా భావిస్తున్నారు.
ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం, ఒక రాష్ట్రంలో రిజిస్టర్ అయిన వాహనం మరో రాష్ట్రంలో ఏడాదికి మించి ఉంటే తప్పనిసరిగా అక్కడ మళ్లీ రిజిస్ట్రేషన్ చేయించాలి. కొత్త ప్రతిపాదన అమల్లోకి వస్తే ఈ గడువు మూడేళ్లకు పెరిగి, వాహన యజమానులపై ఉండే పరిపాలనా భారం తగ్గనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!