

టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంపై పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జూమ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీలు, పార్లమెంట్ ఇంచార్జ్‌లు, ఎస్‌ఐఆర్ పార్లమెంట్ కోఆర్డినేటర్లు, అసెంబ్లీ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేయడంపై ప్రత్యేకంగా చర్చించారు.
సమావేశంలో బూత్ స్థాయిలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ, బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్ఏలు) పనితీరు, ఓటర్ల జాబితా పరిశీలన, అవసరమైన పత్రాల సేకరణ, అర్హులైన ప్రతి ఓటును పరిరక్షించేందుకు చేపడుతున్న చర్యలను సమీక్షించారు. పనితీరు మెరుగుపర్చాల్సిన ప్రాంతాలపై ఇంచార్జ్‌లకు దిశానిర్దేశం చేస్తూ, బూత్ స్థాయిలో సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాలని, ఓటర్ల జాబితా సవరణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని నేతలు సూచించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!