
రాజకీయాలు

భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జన్మదినాన్ని పురస్కరించుకుని తెలుగు MSDians ఫ్యాన్ క్లబ్ ఆధ్వర్యంలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. ధోనిపై అభిమానంతో పాటు చిరంజీవి, రామ్ చరణ్ అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేసి సేవాభావాన్ని చాటారు.
ఈ సందర్భంగా తెలుగు MSDians ఫ్యాన్ క్లబ్ అధ్యక్షుడు ప్రవీణ్ బలుసు, నిర్వాహక బృందం, అలాగే రక్తదానం చేసిన ప్రతి రక్తదాతకు చిరంజీవి ప్రత్యేక ప్రశంసా లేఖ పంపించారు. అభిమానం కేవలం సంబరాలకే పరిమితం కాకుండా సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాల రూపంలో వ్యక్తమవ్వడం గొప్ప విషయమని పేర్కొంటూ, ఇలాంటి మానవతా కార్యక్రమాలు మరెందరికో స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!