
రాజకీయాలు

ప్రధాని నరేంద్ర మోదీ ఇండోనేసియాలోని జకార్తాలో చేసిన ప్రసంగంలో బాలీవుడ్ ప్రసిద్ధ చిత్రం ‘కుచ్ కుచ్ హోతా హై’ పాటను ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది. ఇండోనేసియాలో భారతీయ సినిమాలకు ఉన్న ఆదరణను గుర్తుచేసిన ఆయన, ఈ పాట అక్కడ కూడా ఎంతో ప్రజాదరణ పొందిందని చెప్పారు. భారత్, ఇండోనేసియా కలిసి పనిచేస్తే ‘కుచ్ కుచ్’ నుంచి ‘బహుత్ కుచ్’ సాధించవచ్చని చమత్కరించారు.
ఈ విషయంపై బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహర్ ఆనందం వ్యక్తం చేశారు. తన దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని ప్రధాని ప్రస్తావించడం గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. భాషలతో సంబంధం లేకుండా సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతాయని, ఈ పాటను రెండు దేశాల సంబంధాల సందర్భంలో ప్రస్తావించినందుకు ధన్యవాదాలు తెలిపారు. 1998లో విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!