
రాజకీయాలు

అయోధ్య రామ మందిరంలో జరిగిన విరాళాల దొంగతనం కేసులో అవినాష్ శుక్లా కీలక నిందితుడిగా గుర్తించబడ్డాడు. రూ.15 వేల జీతంతో నగదు విరాళాలను లెక్కించే పనిలో చేరిన అతడు, సుమారు 70 సార్లు విరాళాలను దొంగిలించినట్లు విచారణలో వెల్లడైంది. ఈ కేసులో అన్‌కల్ప్ మిశ్ర, లవ్‌కుష్ మిశ్ర, కరుణేష్ పాండేలు అతనికి సహకరించినట్లు సిట్ అధికారులు సీసీటీవీ ఆధారంగా నిర్ధారించారు.
భక్తుల నుండి విరాళాలను అక్రమంగా సేకరించేందుకు నిందితులు నకిలీ రశీదులను తయారు చేసినట్లు వెల్లడైంది. ఈ ఫోర్జరీ రశీదుల ద్వారా డబ్బులు సేకరించినట్లు అన్‌కల్ప్ మిశ్ర, లవ్‌కుష్ మిశ్ర, కరుణేష్ పాండే, టిన్నూ యాదవ్ అంగీకరించారు. ఈ ఘటన ఆలయ భద్రతా వ్యవస్థలపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!