
క్రీడలు

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ఫారం–7 దుర్వినియోగంపై ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ద్వారా ఓటర్ల రాజకీయ అభిప్రాయాలను గుర్తించే అవకాశం ఉందని, అలాంటి సమాచారాన్ని ఉపయోగించి అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆందోళనలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇవి ఎస్‌ఐఆర్ ప్రక్రియపై భట్టి వ్యక్తం చేసిన ఆరోపణలు, ఆందోళనలు.
ప్రజల ఓటు హక్కును కాపాడటం ప్రజాస్వామ్యానికి పునాది అని భట్టి విక్రమార్క అన్నారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు పూర్తి విశ్వాసం కలిగేలా ఎన్నికల సంఘం పారదర్శకతను నిర్ధారించాలని సూచించారు. అవసరమైతే బ్యాలెట్ పేపర్ విధానాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని ఎన్నికల ప్రక్రియపై ప్రజల నమ్మకాన్ని మరింత బలోపేతం చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!