

తన నియోజకవర్గంలో ఇటీవల జరిగిన పరిషత్ ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందడం తనకు తీవ్ర అవమానంగా ఉందని ఎమ్మెల్యే థామస్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం పెనుమూరులో పార్టీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఎన్నికల ఫలితాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దాదాపు 40 ఏళ్లుగా నియోజకవర్గంలో పార్టీని నడిపిస్తున్నప్పటికీ, మూడు ఎంపీపీ, నాలుగు జడ్పీటీసీ స్థానాలను ఎందుకు గెలుచుకోలేకపోయామని నాయకులను ప్రశ్నించారు. ఎన్నికల్లో ఎదురైన పరాజయం కారణంగా సహచర ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడలేని పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు.
రాబోయే సర్పంచ్ ఎన్నికల్లోనైనా పార్టీ తప్పనిసరిగా విజయం సాధించాలని నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే థామస్ సూచించారు. గ్రామస్థాయి ఎన్నికల్లో కూడా విజయం సాధించలేకపోతే 2029లో తాను ఎమ్మెల్యేగా ఉండబోనని ఆవేదనతో పేర్కొన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీపీలు హరిబాబునాయుడు, షణ్ముగవర్మ, డీసీసీబీ మాజీ డైరెక్టర్ బాలాజీ, జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!