

ఎస్ఐఆర్ లేకుంటే విజయ్ కచ్చితంగా తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యేవారు కాదని భాజపా సీనియర్ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యానించారు. మంగళవారం తిరుచ్చి విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడిన ఆమె.. తిరుప్పరంకుండ్రం కొండపై కార్తిక దీపం వెలిగించేందుకు తాము ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. గతంలో దీపం వెలిగించకుండా అడ్డుకున్న డీఎంకే ప్రభుత్వం ప్రస్తుతం అధికారంలో లేదని పేర్కొన్నారు. ఈ విషయంలో మంత్రి నిర్మల్‌కుమార్ వ్యతిరేకంగా మాట్లాడటాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. కార్తిక దీపం వ్యవహారంలో కోర్టును ఆశ్రయించడం సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ ఈ అంశంపై మంచి తీర్పు వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
మహిళా జిల్లా కలెక్టర్‌కు అసభ్యకర సందేశాలు పంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేను ముఖ్యమంత్రి విజయ్ పిలిచి మాట్లాడాలని తమిళిసై సూచించారు. సోనియాగాంధీ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో విజయ్‌కు వేదికపై స్థానం కల్పించలేదని అన్నారు. కావేరీ జలాల వివాదంపై స్పందిస్తూ.. తమిళనాడుకు కూడా కావేరీ నదీ జలాలపై హక్కు ఉందనే విషయాన్ని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. కాంగ్రెస్‌తో పొత్తు విషయంలో తమిళగ వెట్రి కళగం (టీవీకే) మరోసారి పునరాలోచన చేయాలని విజయ్‌కు సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలు, కార్తిక దీపం వివాదం, కావేరీ జలాల అంశాలపై ఆమె తన అభిప్రాయాలను వెల్లడించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!