

ఈ ఏడాది పలు హిందీ సినిమాలకు సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ‘ధురంధర్: ది రివెంజ్’, ‘కాక్‌టెయిల్ 2’, ‘ఓ’ రోమియో’, ‘బట్వారా 1947’, ‘మిర్జాపూర్: ది మూవీ’, ‘బందర్’ వంటి చిత్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. తాజాగా విడుదలకు సిద్ధమవుతున్న కరీనా కపూర్ ఖాన్ ‘దాయ్రా’, కునాల్ ఖేము ‘వైబ్’ సినిమాలకు కూడా పెద్దలకు మాత్రమే అనుమతించే ఏ సర్టిఫికెట్లు లభించాయి.
కరీనా కపూర్ ఖాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ‘దాయ్రా’ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ‘రాజీ’ చిత్రంతో గుర్తింపు పొందిన మేఘనా గుల్జార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి ఏ సర్టిఫికెట్‌తో పాటు 2 గంటల 23 నిమిషాల నిడివికి సెన్సార్ ఆమోదం లభించింది. సినిమా కథాంశం క్రైమ్ థ్రిల్లర్ కావడంతో ఏ సర్టిఫికెట్ రావడం పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు.
అయితే కునాల్ ఖేము దర్శకత్వం వహిస్తూ ప్రధాన పాత్రలో నటించిన ‘వైబ్’కు కూడా ఏ సర్టిఫికెట్ రావడం ఆసక్తికరంగా మారింది. వినోదాత్మక చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకు 2 గంటల 25 నిమిషాల నిడివికి సెన్సార్ అనుమతి లభించింది. ప్రీతి జీ జింటా, స్పర్శ్ శ్రీవాస్తవ, వంశికా ధీర్, దినేష్ లాల్ యాదవ్ అలియాస్ నిరహువా, యశ్‌పాల్ శర్మ కీలక పాత్రల్లో నటించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!