
బిజినెస్

ఈ వారం థియేటర్లలో ఎపిక్, మారెమ్మ, మహేంద్ర గిరి వారాహి, మండాడి, సర్దార్ 2 వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే వీటిలో ఏ సినిమాకూ ఇప్పటివరకు సూపర్ హిట్ టాక్ రాలేదు. సినిమాలు ఓకే, పర్లేదనే అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీంతో ఈ వీకెండ్‌లో ఓటీటీ కంటెంట్‌పై ప్రేక్షకుల ఆసక్తి మరింత పెరిగింది.
మరోవైపు ఈరోజు వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఏకంగా 26 సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. వీటిలో పలు తెలుగు సినిమాలతో పాటు డబ్బింగ్ చిత్రాలు కూడా ఉన్నాయి. సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్, విశాల్ మకుటం, మహారాజా హాస్టల్, పంచనామా, కట్టాలన్, వరవు వంటి చిత్రాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ వీకెండ్‌లో ఇంట్లోనే సినిమా ఎంజాయ్ చేయాలనుకునేవారికి ఈ ఓటీటీ లైనప్ మంచి ఎంపికలను అందిస్తోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!