

హిందీ మల్టీ జనరేషనల్ కామెడీ-డ్రామా సిరీస్ చుంబక్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. సెప్టెంబర్ 10, 2026 నుంచి భారత్‌లో ఈ సిరీస్ అందుబాటులోకి వచ్చింది. సందడిగా ఉండే ఓ అర్బన్ కాలనీ నేపథ్యంలో కథ సాగుతుంది. ఇందులోని ఐదు విభిన్న కుటుంబాలు క్రమంగా ఒకే పెద్ద కుటుంబంలా మారుతాయి. హాస్యం, ఆప్యాయత, నాస్టాల్జియాను మేళవిస్తూ.. కాలనీ జీవనంలోని సరదా పరిస్థితులు, గోప్యతకు తావులేని వాతావరణం, చిన్న విషయం కూడా అందరి చర్చగా మారే తీరు వంటి అంశాలను సిరీస్‌లో చూపించారు. తొలుత ఆగస్టు 28న విడుదల కావాల్సిన ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ ప్రమోషనల్ ప్లాన్‌లో మార్పుల కారణంగా దాదాపు రెండు వారాలు వాయిదా పడింది.
జమన్దాస్ (జేడీ) మజేథియా నిర్మాణంలో హ్యాట్స్ ఆఫ్ ప్రొడక్షన్ బ్యానర్‌పై రూపొందిన ఈ సిరీస్‌కు అతిష్ కపాడియా రచన, దర్శకత్వం వహించారు. నీనా గుప్తా, దేవెన్ భోజాని, సుమీత్ వ్యాస్, మానసి పారేఖ్, అర్జున్ బిజ్లానీ, హెల్లీ షా, డెల్నాజ్ ఇరానీ, సుమీత్ రాఘవన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ రిలీజ్ షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 10న మధ్యాహ్నం 12.30 గంటలకు భారత్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!