

సూర్య, మమితా బైజు జంటగా నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్లలో విడుదలై బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.260 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా సెప్టెంబర్ 11 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో థియేటర్లలో సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఇంటి నుంచే వీక్షించవచ్చు.
ఈ చిత్రంలో సూర్య సంజయ్ విశ్వనాథ్ అనే వ్యాపారవేత్త, ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన షూటర్ పాత్రలో కనిపిస్తాడు. 40 ఏళ్ల వయసులోనూ పెళ్లికి దూరంగా ఉండే సంజయ్ సరోగసి ద్వారా ఓ మగబిడ్డకు తండ్రవుతాడు. కొంతకాలానికి ఆ బాలుడు అరుదైన వ్యాధికి గురై బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్ అవసరం ఏర్పడటంతో, అతడికి జన్మనిచ్చిన మ్యాడీని వెతికి భారత్‌కు తీసుకొస్తాడు. ఆ తర్వాత వారి జీవితాల్లో చోటుచేసుకునే పరిణామాలు, సంజయ్ ప్రేమ, పెళ్లిపై ఆలోచనలు ఎలా మారతాయన్నదే కథ.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!