

బిగ్‌బాస్ తెలుగు 10 తాజా వీకెండ్ ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున చేసిన ఓ పని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కంటెస్టెంట్లకు ఇచ్చిన మిల్క్‌షేక్‌లను తాగిన తర్వాత వారు ఉపయోగించిన గ్లాసులను నాగార్జున స్వయంగా కడిగారు. రోహిత్ గిన్నెలు కడగడం తన డ్యూటీ అయినప్పటికీ, ఇతరులు ఎంగిలి చేసిన ప్లేట్లు, గ్లాసులు ఎందుకు కడగాలని ప్రశ్నించడంపై నాగార్జున క్లాస్ తీసుకున్నారు. ఏ పనీ చిన్నది కాదని, ఇలాంటి ఆలోచనలు ఇంట్లో ఉండకూడదని సూచించారు.
రోహిత్ చేసిన వ్యాఖ్యలపై ప్రశ్నించిన నాగార్జున, గిన్నెలు కడగడం అతని బాధ్యతేనని స్పష్టం చేశారు. అనంతరం త్రిగుణ్ రోహిత్‌ను ‘పిల్ల బచ్చా’, ‘డొల్ల రాజా’, ‘స్టెరాయిడ్ డొల్ల’ అంటూ చేసిన వ్యాఖ్యలను నాగార్జున గుర్తుచేశారు. దీంతో త్రిగుణ్ వెంటనే క్షమాపణ చెప్పాడు. అతని వ్యాఖ్యలకు శిక్షగా స్విమ్మింగ్ పూల్ పక్కన ఉన్న పెద్ద టైర్‌ను తాను చెప్పే వరకు ఎత్తుకుని తిరగాలని నాగార్జున ఆదేశించారు.
అయితే త్రిగుణ్‌తో పోలిస్తే రోహిత్‌పై నాగార్జున ఎక్కువగా సీరియస్ కావడంపై ప్రేక్షకుల్లో చర్చ మొదలైంది. త్రిగుణ్ చేసిన వ్యాఖ్యలపై గట్టిగా మందలిస్తారని భావించినప్పటికీ, అతనికి తేలికపాటి హెచ్చరికతో పాటు శిక్ష మాత్రమే విధించారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ సీజన్‌లో త్రిగుణ్ గొడవలు, వాదనలతో ఎక్కువ కంటెంట్ అందిస్తున్నందుకే అతనిపై మృదువుగా వ్యవహరిస్తున్నారా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!