

సామాజిక మాధ్యమాల్లో మెగాస్టార్ చిరంజీవిపై అభ్యంతరకరమైన, అసభ్యకరమైన పోస్టులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మెగా యూత్ ఫోర్స్ నాయకులు రాజోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిరంజీవి ప్రతిష్ట, ప్రజాదరణను దెబ్బతీసేలా కొంతమంది ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారు ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా మెగా యూత్ ఫోర్స్ కన్వీనర్ కోళ్ల బాబి, జనసేన పార్టీ ముఖ్య నాయకులతో కలిసి రాజోలు పోలీస్ స్టేషన్‌లో సీఐ సురేష్ బాబును కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.
నవీన్ కుమార్ గౌడ్ అనే వ్యక్తి చిరంజీవి ఫొటోలను అభ్యంతరకరంగా మార్ఫింగ్ చేస్తూ, తప్పుడు రాతలతో విద్వేషపూరిత ప్రచారం చేస్తున్నారని నాయకులు ఆరోపించారు. ఆయనపై తక్షణమే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే ప్రత్యర్థులు, దుష్టశక్తులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాయని వారు విమర్శించారు. ఇలాంటి సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయకపోతే, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!