

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం లండన్‌లో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్, జర్మనీ ఛాన్స్లర్ ఫ్రీడ్రిక్ మెర్జ్‌లతో జెలెన్స్కీ భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో ట్రంప్ ప్రస్తావించిన శాంతి ప్రతిపాదన, యుద్ధం ముగింపునకు తీసుకోవాల్సిన చర్యలు విస్తృతంగా చర్చించబడ్డాయి.
ఉక్రెయిన్‌కు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ అత్యంత సన్నిహిత మిత్రదేశాలుగా ఉండటంతో ఈ సమావేశం ప్రాధాన్యం పెరిగింది. యూరప్‌లో స్థిరత్వం, భద్రత కోసం రాబోయే రోజులు అత్యంత కీలకమని జర్మనీ ఛాన్స్లర్ ఫ్రీడ్రిక్ మెర్జ్ వ్యాఖ్యానించారు. శాంతి ప్రక్రియపై మూడు యూరోపియన్ దేశాల ఏకాభిప్రాయం జెలెన్స్కీ నిర్ణయంపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!