

ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ సేవల్లో అంతరాయం నెలకొంది. మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లలో యూట్యూబ్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించినప్పుడు “Something went wrong” అనే సందేశం కనిపించడంతో యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అనేక మందికి వీడియోలు డౌన్లోడ్ కాకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా భారీగా ఫిర్యాదులు నమోదయ్యాయి.
అమెరికాలో మాత్రమే మూడు లక్షలకు పైగా యూజర్లు డౌన్డిటెక్టర్కు ఫిర్యాదులు చేయడం ఈ సమస్య తీవ్రతను చూపిస్తోంది. దీనిపై స్పందించిన యూట్యూబ్ యాజమాన్యం స్ట్రీమింగ్లో కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపింది. సమస్యను త్వరగా పరిష్కరించేందుకు టెక్నికల్ టీమ్లు పనిచేస్తున్నాయని పేర్కొంది. భారత్ నుంచి కూడా సెర్చ్ ఫలితాలు కనిపించకపోవడం, వీడియోలు ప్లే కాకపోవడం వంటి సమస్యలపై 18 వేలకుపైగా ఫిర్యాదులు వచ్చినట్లు వెల్లడించింది.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!