
న్యూస్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మేరఠ్‌కు చెందిన 23 ఏళ్ల యంగ్ బైకర్ తాప్సీ ఉపాధ్యాయ ఈ రోజు మంగళగిరి క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. “ఒబేసిటీ ఫ్రీ ఇండియా మిషన్ – హెల్తీ ఇండియా” పేరుతో దేశవ్యాప్తంగా చేపట్టిన తన బైక్ యాత్ర వివరాలను ఆయనతో పంచుకున్నారు.
ఆరోగ్యంపై అవగాహన పెంచే లక్ష్యంతో 2025 ఈ నెల 9 న మేరఠ్ నుంచి యాత్ర ప్రారంభించిన తాప్సీ ఇప్పటివరకు సుమారు 17,400 కిలోమీటర్లు ప్రయాణించి 500 కు పైగా విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పటివరకు 16 రాష్ట్రాల్లో యాత్ర పూర్తిచేసి, మిగిలిన రాష్ట్రాల్లో కొనసాగించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆమెను సత్కరించి, ఆమె స్ఫూర్తిదాయక యాత్ర యువతకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!