

రోడ్లపై ట్రాఫిక్ నిబంధనలు పదేపదే ఉల్లంఘిస్తూ చలాన్లు చెల్లించకుండా వదిలేస్తే ఇకపై తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. డ్రైవింగ్ లైసెన్స్ (డీఎల్), వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్సీ)లను ఫ్రీజ్ చేసే విధానాన్ని రవాణాశాఖ అమలు చేయడానికి సిద్ధమవుతోంది. పెండింగ్ చలాన్లు చెల్లించే వరకు సంబంధిత ఆర్టీఏ సేవలు నిలిపివేయబడతాయి. ట్రాఫిక్ జరిమానాలపై వచ్చే ఫిర్యాదులను పారదర్శకంగా, వేగంగా పరిష్కరించేందుకు కేంద్ర మోటార్ వాహన నిబంధనల ప్రకారం గ్రీవెన్స్ రెడ్రెసల్ వ్యవస్థను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
కొత్త విధానంలో చలాన్లపై అభ్యంతరాలను వాహనదారులు కేవలం ఆన్లైన్ పోర్టల్ ద్వారా మాత్రమే నమోదు చేయాలి. అధికారులు పరిశీలించి నిర్ణయాన్ని ఎలక్ట్రానిక్ రూపంలో తెలియజేస్తారు. చలాన్ వచ్చిన 45 రోజుల్లో ఫిర్యాదు చేయాలి, అధికారులు 30 రోజుల్లో పరిష్కరించాలి. ఏడాదిలో ఐదుకంటే ఎక్కువ చలాన్లు పెండింగ్లో ఉంటే డీఎల్ లేదా ఆర్సీ బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. చెల్లింపులు పూర్తయ్యే వరకు సేవలు నిలిపివేయబడతాయి. కోర్టు ద్వారా కూడా న్యాయం పొందే అవకాశం ఉంటుంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!