
న్యూస్

రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘పెద్ది’ చిత్రం గ్రామీణ క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం చిత్రీకరణ కొనసాగుతుండగా, ఒక రోజు క్రితం రామ్ చరణ్ ఎడమ కంటికి స్వల్ప గాయం కావడంతో కొద్దిసేపు విరామం ఇచ్చారు. అయితే ఈ రోజు నుంచి మళ్లీ సాధారణంగా చిత్రీకరణ కొనసాగుతోంది.
ఇక ఈ సినిమా విడుదల తేదీపై మరోసారి ప్రచారం సాగుతోంది. ముందుగా వచ్చే నెల 30 న విడుదల చేయాలని భావించినప్పటికీ, ఇప్పుడు అదే తేదీని వచ్చే నెల 8 కు మార్చే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. లేదంటే మే 21 న విడుదల చేసే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. రేపు రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో టీజర్ విడుదలపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.



.webp&w=3840&q=75)


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!