

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 23 ఏళ్ల విద్యార్థిని అమెరికాలో ఆకస్మిక అనారోగ్యంతో గురువారం రాత్రి దుర్మరణం చెందింది. మృతురాలు యర్లగడ్డ రాజ్యలక్ష్మి, బాపట్ల జిల్లా కారం చెడు గ్రామానికి చెందిన రామకృష్ణ మరియు నాగమణి దంపతుల కుమార్తె. విజయవాడలోని ఒక ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో చదువులు పూర్తిచేసిన ఆమె, తరువాత అమెరికాకు వెళ్లి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ చేసింది. ఇటీవలే కోర్సు పూర్తిచేసి ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తోంది. కొన్ని రోజులుగా తీవ్రమైన జలుబుతో బాధపడుతున్నట్లు ఆమె కుటుంబ సభ్యులకు తెలిపింది. గురువారం రాత్రి తల్లిదండ్రులతో మాట్లాడి, నవంబర్ 9న డాక్టర్ అపాయింట్మెంట్ పెట్టుకున్నట్లు చెప్పింది. కానీ ఆ రాత్రే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటనతో ఆమె కుటుంబం తీవ్ర షాక్‌కు గురైంది.
పర్చూరు ఎమ్మెల్యే యేలూరి సాంబశివరావు సంతాపం వ్యక్తం చేస్తూ, మృతదేహాన్ని భారత్‌కు రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయం అందిస్తుందని తెలిపారు.











కామెంట్స్ (4)
very sad..
రాజ్యలక్ష్మి ఆత్మకు శాంతి లభించాలి
యువ విద్యార్థినిని కోల్పోవడం ఎంతో బాధాకరం
Emotional shock