
గాసిప్స్

భారతదేశ 77 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రపంచ దేశాల నుంచి శుభాకాంక్షల సందేశాలు వెల్లువెత్తాయి. చైనా, రష్యా, అమెరికా, ఫ్రాన్స్, యూరోపియన్ యూనియన్, ఇరాన్, నేపాల్, ఆస్ట్రేలియా, భూటాన్ తదితర దేశాల అధినేతలు, మంత్రులు భారత ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భారత్తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.

ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ ధరించిన సంప్రదాయ తలపాగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్డెర్ లేయెన్ భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే దుస్తులు ధరించి అందరి ప్రశంసలు పొందారు. ఈ వేడుకలు భారతదేశ అంతర్జాతీయ ప్రతిష్ఠను మరింత చాటిచెప్పాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!