

ప్రతి ఏడాది జులై లేదా ఆగస్టులో హైదరాబాద్లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం (WEF) ఫాలో - అప్ సదస్సు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. దావోస్లో జరిగిన ‘జాయిన్ ది రైజ్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పెట్టుబడులు మరియు వ్యాపార నిర్ణయాల కోసం ఏడాది కాలం వేచి చూడటం ఈ కాలంలో చాలా ఎక్కువని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనకు గ్లోబల్ బిజినెస్ లీడర్లు, పాలసీ నిర్ణేతలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు.
హైదరాబాద్లో ఇటీవల నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ద్వారా రూ.5.75 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు ఆకర్షించామని సీఎం వెల్లడించారు. హైదరాబాద్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు ప్రధాన కేంద్రంగా మారిందని, మూసీ నది పునరుజ్జీవనం, రివర్ ఫ్రంట్ అభివృద్ధి, నైట్ టైమ్ ఎకానమీపై దృష్టితో దేశంలోనే తొలి 24 గంటల నగరంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం, తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్, తెలంగాణ AI ఇన్నోవేషన్ హబ్, నెక్స్ట్- జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ ఆవిష్కరణ ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. ప్రముఖ నటుడు చిరంజీవి ఈ సమావేశంలో ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!