

విరాట్ కోహ్లీ, మాజీ భారత ప్రధాన కోచ్ రవిశాస్త్రి మధ్య ఉన్న అనుబంధం భారత క్రికెట్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించింది. వీరిద్దరి హయాంలో టీమిండియా విదేశాల్లో అనేక చిరస్మరణీయ టెస్టు విజయాలను నమోదు చేసింది. తాజాగా విరాట్ కోహ్లీని అహంకారి, ఉద్రేక స్వభావం కలిగిన వ్యక్తిగా అభివర్ణించిన సోషల్ మీడియా పోస్టుపై స్పందించిన రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కోహ్లీపై ఉన్న ఆ అభిప్రాయాలు మైదానంలో చూసినప్పుడు నిజమేననిపించవచ్చని, కానీ అవి పూర్తిగా ఆటకు మాత్రమే పరిమితమని రవిశాస్త్రి చెప్పారు. మైదానంలో పోటీ తత్వంతో కనిపించే కోహ్లీ, బయట మాత్రం పూర్తిగా భిన్నమైన వ్యక్తి అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, తొడ కండరాల గాయం కారణంగా అఫ్గానిస్థాన్తో వన్డే సిరీస్కు దూరమైన కోహ్లీ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. వచ్చే వన్డే ప్రపంచకప్లో ఆడటమే తన ప్రధాన లక్ష్యమని ఇప్పటికే స్పష్టం చేశాడు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!