

జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీలో నిర్వహించిన ‘సేన ప్రస్థానం – జాతీయ సమైక్యత కోసం’ కార్యక్రమంలో కీలక ప్రసంగం చేశారు. 2014లో జనసేన పార్టీని స్థాపించిన సమయంలో అధికారం, పదవులు లేదా రాజకీయ ప్రయోజనాల గురించి ఎలాంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు. దేశానికి సేవ చేయడం, జాతీయ సమైక్యతను కాపాడడం, దేశ సమగ్రతకు అండగా నిలవడం లక్ష్యంగానే జనసేన ప్రస్థానం ప్రారంభమైందని పేర్కొన్నారు.
జనసేన భావజాలం దేశవ్యాప్తంగా బలపడుతోందని, ఇతర రాష్ట్రాల నుంచి కూడా పార్టీ కోసం పని చేయడానికి ప్రజలు ముందుకు వస్తున్నారని పవన్ కళ్యాణ్ తెలిపారు. తెలంగాణ ఏర్పాటును జనసేన ఎప్పుడూ వ్యతిరేకించలేదని, విభజన జరిగిన విధానాన్ని మాత్రమే విమర్శించామని అన్నారు. దేశ సమగ్రతకు విఘాతం కలిగించే, విభజనవాదాన్ని ప్రోత్సహించే శక్తులను జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. అలాగే పార్టీ ఎంపీలు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశ ప్రజల సమస్యలపై గళమెత్తాలని పిలుపునిచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!