
సినిమాలు

లతా రజనీకాంత్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సూపర్ స్టార్ రజనీకాంత్ 2021లో రాజకీయాల్లోకి రాకపోవడం తనకు కొంత బాధ కలిగించిందని చెప్పారు. రజనీకాంత్ ఒక గొప్ప నాయకుడని, తమిళనాడు అభివృద్ధికి సంబంధించిన ఎన్నో ప్రణాళికలు, కలలు ఆయన వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఉంటే రాష్ట్రానికి మరింత మేలు జరిగి ఉండేదని అభిప్రాయపడ్డారు.
కోవిడ్ పరిస్థితుల కారణంగానే రజనీకాంత్ ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని లతా తెలిపారు. రాష్ట్రం ఎలా ఉండాలో ఆయనకు స్పష్టమైన దార్శనికత ఉందని, తమిళనాడు ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందనే భావన తనకు ఉందన్నారు. మరోవైపు, ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వంపై స్పందిస్తూ, ప్రభుత్వం ఏర్పడి కేవలం 30 రోజులు మాత్రమే అయినందున ఇప్పుడే ఎలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!