
సినిమాలు

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు, పోషకాహార స్థాయిని మెరుగుపరచే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించింది. పైలట్ ప్రాజెక్ట్‌గా రాష్ట్రంలోని నాలుగు జిల్లాలను ఎంపిక చేయగా, సంగారెడ్డి జిల్లాలోని కంది, పటాన్చెరు మండలాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. విద్యార్థులకు ఉదయం పాఠశాల ప్రారంభానికి ముందు పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించనున్నారు.
ఈ పథకం కింద ఇడ్లీ, మిల్లెట్ ఇడ్లీ, దోశ, పూరి, ఉప్మా, సాంబార్, చట్నీ వంటి ఆహార పదార్థాలను మెనూలో చేర్చారు. విద్యార్థుల ఆరోగ్యం, ఏకాగ్రత పెరగడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు కూడా పెరుగుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు ఈ పథకం ఎంతో ఉపయోగపడనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!