

అమెరికా–ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య జరుగుతున్న ఘర్షణలు మరింత తీవ్రమవుతున్నాయి. సోమవారం అనేక ప్రాంతాల్లో పరస్పర దాడులు కొనసాగాయి. ఇరాన్‌కు మద్దతుగా మిలిటెంట్ గ్రూపులు రంగంలోకి దిగడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. అమెరికా–ఇజ్రాయెల్ ఇరాన్ ఆయుధాగారాలను లక్ష్యంగా చేసుకుంటుండగా, గల్ఫ్ దేశాల్లోని చమురు శుద్ధి కేంద్రాలు, హర్మూజ్ జలసంధిలో చమురు నౌకలపై ఇరాన్ దాడులు చేస్తోంది. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ఈ మార్గంపై దాడులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపే అవకాశముంది. చర్చలకు సిద్ధమని అమెరికా ప్రకటించినప్పటికీ, ఇరాన్ తిరస్కరించింది. యుద్ధం కారణంగా వేలాది విమాన ప్రయాణికులు చిక్కుకుపోయారు.
గల్ఫ్ ప్రాంతంలోని చమురు కేంద్రాలు, అమెరికా స్థావరాలు, ఇజ్రాయెల్ ప్రాంతాలు లక్ష్యంగా దాడులు జరిగాయి. సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, యూఏఈ వంటి దేశాల్లో పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఎల్ఎన్జీ ఉత్పత్తి నిలిపివేతతో అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు పెరిగాయి. ఇరాన్లో 555 మంది మృతి చెందినట్లు నివేదికలు చెబుతున్నాయి. నతాంజ్ అణు కేంద్రంపై దాడుల ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రపంచ దేశాలు సంయమనం పాటించాలని పిలుపునిస్తున్నా, యుద్ధం మరింత విస్తరించే సూచనలు కనిపిస్తున్నాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!