
గాసిప్స్

ప్రొఫెసర్ కోదండరాం, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేశారు. అనవసర వివాదాలకు తెరలేపుతూ వ్యక్తుల మధ్య భేదాలను ప్రాంతాల మధ్య విభేదాలుగా మార్చుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అభ్యంతరం ఉంటే వ్యక్తం చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయని, పోలీసు కేసుల వరకు తీసుకెళ్లడం సరైనది కాదని అన్నారు.
తెలంగాణ విషయంలో మొదటి నుంచి భారతీయ జనతా పార్టీకి సానుకూల వైఖరి లేదని ఆయన ఆరోపించారు. పవన్ కళ్యాణ్ ద్వారా బీజేపీ ఈ అంశాలను నడిపిస్తోందని విమర్శించారు. డిస్కం విధానం రైతులకు లాభం చేకూర్చితే మంచిదేనని, అయితే ప్రభుత్వ లక్ష్యాలు స్పష్టంగా ఉండాలని కోదండరాం అభిప్రాయపడ్డారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!