
గాసిప్స్

గచ్చిబౌలిలో నిర్వహించాలనుకున్న బహిరంగ సభకు అధికారులు అనుమతి నిరాకరించడంతో, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు సాయంత్రం 4:30 గంటలకు హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించిన పవన్ కళ్యాణ్, కనీసం ప్రెస్ మీట్‌కు అయినా అనుమతి ఇవ్వాలని అధికారులను కోరారు. సభపై విధించిన ఆంక్షల పట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియాతో మాట్లాడే అవకాశాన్ని కల్పించాలని తన పోస్టులో పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!