
రాజకీయాలు

కేంద్ర హోంశాఖ వలసలు, విదేశీయుల సవరణ నిబంధనలు 2026ను ప్రకటించింది. భారత్‌లో నివసిస్తున్న విదేశీయుల నమోదు ప్రక్రియలో కీలక మార్పులు చేస్తూ కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ మార్పుల ద్వారా నమోదు విధానాన్ని మరింత సులభతరం చేయడంతో పాటు సమాచార నిర్వహణను బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
భారతీయ తల్లిదండ్రులతో సంబంధం ఉన్న లేదా వారికి జన్మించిన పిల్లలకు సంబంధించిన కొత్త నిబంధనలను కూడా ఇందులో చేర్చారు. పరిపాలనా సామర్థ్యాన్ని పెంచడం, చట్టాల అమలును మరింత సమర్థవంతంగా చేయడం, నమోదు విధానంపై స్పష్టత తీసుకురావడం ఈ మార్పుల ప్రధాన ఉద్దేశమని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!