
గాసిప్స్

ప్రపంచ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ర్యాంకింగ్స్‌లో భారత్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. జూన్ 1 నాటికి దక్షిణ కొరియా మార్కెట్ క్యాపిటలైజేషన్ 5.04 ట్రిలియన్ డాలర్లకు చేరుకోగా, భారత్ మార్కెట్ విలువ 4.84 ట్రిలియన్ డాలర్లతో ఏడో స్థానానికి పడిపోయింది. దీంతో దక్షిణ కొరియా ఆరో స్థానాన్ని దక్కించుకుంది.
ఇప్పటికే 5.15 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో తైవాన్ భారత్‌ను అధిగమించి ఐదో స్థానంలో కొనసాగుతోంది. వరుసగా రెండు కీలక ఆసియా మార్కెట్లు భారత్‌ను వెనక్కి నెట్టడం గమనార్హం. ఆసియా ఆర్థిక మార్కెట్లలో వేగంగా మారుతున్న పరిస్థితులు పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!