

గల్ఫ్ ప్రాంతంలో ఏర్పడిన సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పౌరవిమానయాన శాఖ మరియు విమాన నియంత్రణ విభాగం అధికారులతో కలిసి పరిస్థితిని పరిశీలించారు. పశ్చిమ ఆసియా దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి గత పది రోజులుగా చేపట్టిన చర్యల గురించి అధికారులు వివరించారు. స్థానిక రాయబార కార్యాలయాలు మరియు విమాన సిబ్బంది సమన్వయంతో ప్రయాణికులను సురక్షితంగా తరలిస్తున్నట్లు తెలిపారు.
అధికారుల సమాచారం ప్రకారం దోహా నుంచి ఢిల్లీ, ముంబై, కొచ్చిలకు ప్రతి రోజూ సుమారు 850 మంది ప్రయాణికులను తరలిస్తున్నారు. సౌదీ అరేబియాలోని దమ్మామ్ విమానాశ్రయం నుంచి కొచ్చికి రోజుకు సగటున 166 మందిని తరలిస్తున్నారు. బహ్రెయిన్ నుంచి తెలుగు వారిని దమ్మామ్కు తీసుకెళ్లి అక్కడి నుంచి గల్ఫ్ ఎయిర్ విమానంలో కొచ్చికి తరలిస్తున్నట్లు తెలిపారు. దేశీయ విమాన సంస్థలు మరియు గల్ఫ్ ఎయిర్ సహకారంతో ఇప్పటివరకు దాదాపు లక్ష మంది భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. తరలింపు ప్రక్రియలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని, వీసా సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!