

తెలంగాణలో జనగణన–2027 స్వీయ నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా లోక్ భవన్‌లో ఆన్‌లైన్ ద్వారా తన వివరాలు నమోదు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ జనగణన దేశానికి అత్యంత కీలకమైన కార్యక్రమమని తెలిపారు. జనాభా, వారి సామాజిక–ఆర్థిక పరిస్థితులపై స్పష్టమైన సమాచారం అందించడం ద్వారా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుందని అన్నారు.
తెలంగాణలో స్వీయ నమోదు దశ ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు కొనసాగుతుందని, ఆ తర్వాత మే 11 నుంచి జూన్ 9 వరకు గృహ జాబితా ప్రక్రియ జరుగుతుందని వెల్లడించారు. ఇది దేశంలో మొట్టమొదటి పూర్తి డిజిటల్ జనగణన కావడం విశేషమని పేర్కొన్నారు. ప్రతి కుటుంబం స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకోవచ్చని, ఈ ప్రక్రియ సులభంగా, పారదర్శకంగా ఉంటుందని చెప్పారు. ప్రజలందరూ చురుకుగా పాల్గొని ఖచ్చితమైన సమాచారాన్ని అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సెన్సెస్ డైరెక్టర్ భారతీ హోళికేరి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్ తదితరులు పాల్గొన్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!