

క్యాన్సర్ ప్రాణాంతక వ్యాధి. ఇది శరీరంలో నిశ్శబ్దంగా పెరిగి ఒక్కసారిగా ప్రమాదకరంగా మారుతుంది. ఈ వ్యాధికి అనేక కారణాలు ఉన్నప్పటికీ, రోజువారీ అలవాట్ల ద్వారా దీని ప్రమాదాన్ని తగ్గించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. సరైన జీవనశైలి, పోషకాహారం పాటించడం ద్వారా ఈ వ్యాధి ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.
ఆకుకూరలు, పండ్లు, పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. నారింజ, బత్తాయి వంటి నిమ్మజాతి పండ్లు, డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం ద్వారా శరీరానికి రక్షణ లభిస్తుంది. ఫాస్ట్ ఫుడ్, మసాలా ఆహారాన్ని అధికంగా తీసుకోవడం మానుకోవాలి.
పొగాకు, మద్యం క్యాన్సర్‌కు ప్రధాన కారణాలు. ధూమపానం, పొగాకు వాడకం నోరు, ఊపిరితిత్తులు, గొంతు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. మద్యం సేవించడం వల్ల కాలేయ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అధిక బరువు కూడా క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. రోజుకు కనీసం 15 నుంచి 20 నిమిషాలు వ్యాయామం చేయడం ద్వారా బరువును నియంత్రించవచ్చు. కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర ఉంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా 20 సంవత్సరాల వయస్సు తర్వాత క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం అవసరం.
గమనిక : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!