
సినిమాలు

టోల్‌గేట్ సిబ్బంది పై జరిగిన దాడి ఘటన పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనలో పాల్గొన్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అనుచరులపై వెంటనే కేసులు నమోదు చేయాలని అధికారులకు ఆదేశించారు. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె–తిరుపతి రహదారిపై గండబోయినపల్లె టోల్‌గేట్ వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. టోల్‌గేట్ సిబ్బందితో జరిగిన వాగ్వాదం ఉద్రిక్తతకు దారి తీసి, అనంతరం దాడిగా మారినట్లు సమాచారం.
చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే చర్యలను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని సీఎం స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!