

చిరంజీవి తన సోదరుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలిపారు. శస్త్రచికిత్స విజయవంతంగా జరిగిందని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుంటున్నారని, సాధారణ స్థితికి రావడానికి సుమారు వారం సమయం పడుతుందని వైద్యులు సూచించినట్లు వెల్లడించారు. ఆయన కోసం ప్రార్థించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
అల్లు అర్జున్, ఎన్టీఆర్, సాయి ధరం తేజ్, కోన వెంకట్ తదితర సినీ ప్రముఖులు పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. శుక్రవారం అధికారులతో సమావేశం జరుగుతున్న సమయంలో ఆయన అస్వస్థతకు గురై, జూబ్లీహిల్స్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందారు. శనివారం సాయంత్రం శస్త్రచికిత్స నిర్వహించగా, కనీసం పది రోజుల విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. నరేంద్ర మోదీ కూడా ఫోన్ ద్వారా ఆయన ఆరోగ్యాన్ని తెలుసుకున్నారు.


.webp&w=3840&q=75)



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!