
టెక్నాలజీ

ఇప్పటికే ప్రయాణ నిషేధం, ఆంక్షలు విధించిన 19 దేశాలకు చెందినవారి వలసలు, గ్రీన్కార్డుల దరఖాస్తుల ప్రక్రియను అమెరికా ప్రభుత్వం నిలిపేసింది. అమెరికా పౌరసత్వం, వలస సేవల విభాగం వెబ్‌సైట్‌లో మంగళవారం ఈ పాలసీ మెమోను ప్రచురించింది. శ్వేతసౌధంవద్ద ఇటీవల నేషనల్ గార్డులపై ఆఫ్గన్ అమెరికన్ కాల్పులు జరిపిన నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కాల్పుల ఘటనతో వలస విధానాలను సమూలంగా మార్చాలని గతంలోనే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
వలస సేవల దరఖాస్తులను నిలిపేసిన దేశాల్లో ఆఫ్గనిస్తాన్, మయన్మార్, చాద్, ద రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈక్వెటోరియల్ గినీయా, ఎరిత్రియా, హైతీ, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, యెమెన్, బురుండీ, క్యూబా, లావోస్, సియర్రా లియోన్, టోగో, తుర్క్ మెనిస్థాన్, వెనెజువెలా ఉన్నాయి.


.webp&w=3840&q=75)

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!