

పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్‌తో అమెరికా ముమ్మరంగా చర్చలు జరుపుతోంది. ఈ నేపథ్యంలో 15 పాయింట్లతో కూడిన సీజ్ఫైర్ ప్రణాళికను ఇరాన్‌కు పంపినట్లు సమాచారం. ఈ ప్రణాళికలో నతాంజ్, ఇస్ఫహాన్, ఫోర్దో అణు కేంద్రాలను నిర్వీర్యం చేయడం, యురేనియంను అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి అప్పగించడం, అణ్వాయుధాల అభివృద్ధి చేయబోమని హామీ ఇవ్వడం వంటి కీలక షరతులు ఉన్నాయి. అలాగే Strait of Hormuzను స్వేచ్ఛా సముద్ర మార్గంగా తెరవాలని, క్షిపణి కార్యక్రమాలను పరిమితం చేయాలని సూచించింది. ప్రతిగా అంతర్జాతీయ ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయడం, పౌర అణుశక్తి అభివృద్ధికి సహాయం అందిస్తామని అమెరికా హామీ ఇచ్చింది.
అయితే, శాంతి ప్రణాళికను ప్రతిపాదిస్తూ కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం పశ్చిమాసియాకు అదనపు సైనిక బలగాలను పంపేందుకు సిద్ధమవుతోంది. మరో 1000 మంది సైన్యంతో పాటు మెరైన్ యూనిట్లను మోహరించేందుకు చర్యలు చేపడుతోంది. మరోవైపు, ఐఆర్జీసీ ప్రతినిధులు ఈ ప్రణాళికను తీవ్రంగా ఖండిస్తూ, దీనిని శాంతి ఒప్పందంగా కాకుండా అమెరికా ఓటమిగా పేర్కొన్నారు. అమెరికాతో చర్చల వార్తలను కూడా వారు తిరస్కరించడం గమనార్హం.


















.png&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!