
న్యూస్

అమెరికాను తీవ్ర మంచు తుఫాన్ వణికిస్తోంది. గడ్డకట్టే చలి, భారీగా మంచు కురవడంతో అనేక రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించింది. వివిధ ప్రమాద ఘటనల్లో ఇప్పటివరకు 29 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో లక్షలాది మంది అంధకారంలో చిక్కుకోగా, ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.
మంచు తుఫాన్ ప్రభావంతో 15కి పైగా రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. రోడ్డు, రైలు, విమాన రవాణా తీవ్రంగా ప్రభావితమైంది. దాదాపు 17 వేలకుపైగా విమాన సర్వీసులు రద్దవ్వడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!