
జనరల్

రాజధాని ప్రాంతంలోని పలు గ్రామాల రైతులు తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. పెనుమాక, ఉండవల్లి, నిడమర్రు, ఎర్రపాలెం, కురగల్లు గ్రామాల రైతులు భూసేకరణ, రిటర్నబుల్ ఫ్లాట్స్, ల్యాండ్ పూలింగ్ సమస్యలను జగన్ దృష్టికి తీసుకెళ్లారు.
భూములు లాక్కోవడానికి నోటిఫికేషన్లు జారీ చేయడం, బెదిరింపులు, అభివృద్ధి పనుల పేరుతో పొలాలు ధ్వంసం చేస్తున్నారని రైతులు ఫిర్యాదు చేశారు. దేవాలయ భూముల విషయంలో కూడా అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా ముందుకు వెళ్తామని జగన్ తెలిపారు. బలవంతపు భూసేకరణ సరైంది కాదని ఆయన అన్నారు. రాజధాని పేరుతో అవినీతి జరుగుతోందని విమర్శిస్తూ, గ్రోత్ కారిడార్ వంటి ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాలను సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!