
సినిమాలు

అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఇరాన్ రాజకీయ పరిస్థితులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారని, ఆయనపై దాడి జరిగినట్లు తెలిపారు. దాడి కారణంగా మొజ్తాబా ఖమేనీ ముఖం గుర్తుపట్టలేనంతగా దెబ్బతిన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఘటన తర్వాత ఆయన పరిస్థితిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని కూడా హెగ్సెత్ అన్నారు.
మొజ్తాబా ఖమేనీ మొదటి ప్రకటన లిఖిత రూపంలో మాత్రమే రావడం అనుమానాలకు దారితీస్తోందని పీట్ హెగ్సెత్ వ్యాఖ్యానించారు. ఇరాన్ వద్ద అనేక కెమెరాలు, వాయిస్ రికార్డింగ్ సదుపాయాలు ఉన్నప్పటికీ వీడియో లేదా వాయిస్ సందేశం విడుదల చేయకపోవడం ప్రశ్నలు రేకెత్తిస్తున్నదన్నారు. ప్రస్తుతం ఆయన గాయపడి ఎక్కడో పరారీలో ఉన్నారని, అందువల్ల కొత్త సుప్రీం లీడర్కు పూర్తి చట్టబద్ధత లేదని ఆయన అభిప్రాయపడ్డారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!