
జనరల్

జి. కిషన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే నెల 10 న తెలంగాణకు రానున్నారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణకు ఆయన వస్తుండటం ఇదే మొదటిసారి. ఈ పర్యటనలో రూ.7,823 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు.
ఈ పర్యటనలో భాగంగా జహీరాబాద్ ఇండస్ట్రియల్ సిటీని ప్రధాని ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టులతో తెలంగాణలో పరిశ్రమల అభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణకు ఊతం లభిస్తుందని భావిస్తున్నారు. ప్రధాని పర్యటన కోసం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!