
బిజినెస్

ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో గ్లైకోజెన్ నిల్వ వ్యాధితో బాధపడుతున్న 18 నెలల చిన్నారికి అరుదైన కాలేయ మార్పిడి శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. 10 కిలోల బరువున్న చిన్నారికి తండ్రి కాలేయం నుంచి కొంత భాగాన్ని అమర్చారు.
ఈ క్లిష్ట శస్త్రచికిత్స 14 గంటల పాటు కొనసాగింది. ఆరోగ్యశ్రీ పథకం కింద పూర్తిగా ఉచితంగా చికిత్స అందించారు. శస్త్రచికిత్స అనంతరం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి శస్త్రచికిత్సలు అరుదని పేర్కొన్నారు.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!