

రియాన్ పరాగ్ నాయకత్వం వహిస్తున్న రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందిన కెప్టెన్ రియాన్ పరాగ్ వివాదంలో చిక్కుకున్నాడు. మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా అతడు డ్రెస్సింగ్ రూమ్‌లో ఈ-సిగరెట్ (వేపింగ్) ఉపయోగిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
పంజాబ్‌పై ఛేదనలో పరాగ్ 16 బంతుల్లో 29 పరుగులు చేసి ఔటైన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మైదానంలో ఎప్పటికప్పుడు కెమెరాల పర్యవేక్షణ ఉన్నప్పటికీ ఇలా ప్రవర్తించడం అతని నిర్లక్ష్య వైఖరిని సూచిస్తోందని విమర్శకులు అంటున్నారు.
భారత క్రికెట్ నియంత్రణ మండలి నిబంధనల ప్రకారం ఈ విషయంపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఐపీఎల్ వర్గాలు పేర్కొన్నాయి. 2019 లో భారత ప్రభుత్వం ఈ-సిగరెట్ల తయారీ, విక్రయాలపై నిషేధం విధించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఏడాది జైలు శిక్ష లేదా రూ.లక్ష జరిమానా విధించే అవకాశం ఉంది.
ఈ అంశంపై రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం ఇంకా స్పందించలేదు. కాగా, టోర్నీ ప్రారంభంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో రాయల్స్ జట్టు మేనేజర్ రోమి బిందర్ నిబంధనలకు విరుద్ధంగా డగౌట్లో ఫోన్ ఉపయోగించి రూ.లక్ష జరిమానా ఎదుర్కొన్న విషయం గమనార్హం.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!