
జనరల్

ఎన్. చంద్రబాబు నాయుడు పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం 81.1 నుంచి 85.25 శాతానికి పెరగడం ఆనందంగా ఉందన్నారు. బాలుర కంటే బాలికల ఉత్తీర్ణత శాతం 5.22 శాతం ఎక్కువగా ఉండటం సంతోషకరమని పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల ఫలితాల్లో కూడా గణనీయమైన మెరుగుదల కనిపించిందని సీఎం తెలిపారు. గత ఏడాది 72.8 శాతంగా ఉన్న ఉత్తీర్ణత ఈసారి 78.39 శాతానికి పెరిగిందన్నారు. విద్యాశాఖ అమలు చేసిన 100 రోజుల ప్రణాళిక మంచి ఫలితాలు ఇచ్చిందని చెప్పారు. ఇందుకు నారా లోకేష్తో పాటు అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బందిని అభినందించారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!