

ఉస్మానియా జనరల్ ఆసుపత్రి కొత్త భవన నిర్మాణ పనులు వేగంగా పూర్తిచేయాలని రహదారులు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ఆదేశించారు. నిర్మాణ పనులను ఆయన పరిశీలించి, 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్ట్ పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
అన్ని అనుమతులను గ్రీన్ ఛానల్ ద్వారా త్వరగా అందిస్తామని తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న పనుల వేగాన్ని అలాగే కొనసాగించాలని నిర్మాణ సంస్థకు సూచించారు. ఈ సందర్భంగా ఎం ఈ ఐ ఎల్ ప్రతినిధులు, రహదారులు భవనాల శాఖ ఉన్నతాధికారులు, జీ హెచ్ ఎం సీ, ఆరోగ్య, విద్యుత్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఎం ఈ ఐ ఎల్ ప్రాజెక్ట్ విభాగం అధ్యక్షుడు కె గోవర్ధన్ రెడ్డి, ప్రాజెక్ట్ చీఫ్ జనరల్ మేనేజర్ వెనిగళ్ల శ్రీనివాస్, జీ హెచ్ ఎం సీ కమిషనర్ ఆర్ వి కర్ణన్, ప్రత్యేక కార్యదర్శి పీ ప్రావీణ్య, సి ఈ జి రాజేశ్వర్ రెడ్డి, జోనల్ కమిషనర్ బి సంతోష్, టి జి ఎస్ పీ డి సి ఎల్ సీఎండీ జితేష్ వి పాటిల్, మెడికల్ ఎడ్యుకేషన్ అదనపు డైరెక్టర్ డాక్టర్ ఎన్ వాణి పాల్గొన్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!