

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు కృత్రిమ మేధ (ఏఐ), ఐటీ రంగాల్లో పరిజ్ఞానం పెంచుకోకపోతే వెనుకబడతారని హెచ్చరించారు. కేబినెట్ సమావేశం అనంతరం తాజా పరిణామాలపై చర్చిస్తూ, రాష్ట్రానికి గూగుల్ ను తీసుకురావడానికి జరిగిన ప్రయత్నాలను గుర్తు చేశారు. అమెరికా పర్యటనలో మంత్రి నారా లోకేష్ గూగుల్ ప్రతినిధులతో చర్చించి ఒప్పించిన విషయాన్ని ప్రస్తావించారు.
‘జలధార-జలహారతి’ కార్యక్రమంలో మంత్రుల భాగస్వామ్యం ఉండేలా చూడాలని మంత్రి నిమ్మల రామానాయుడుకు సూచించారు. ‘సూర్యఘర్’ లక్ష్యాల సాధనలో వేగం పెంచాలని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కు ఆదేశించారు. సింగపూర్ పర్యటనకు వెళ్లిన మంత్రులు తమ అధ్యయనాలపై నివేదికలు ఇవ్వాలని చెప్పారు. పుట్టపర్తి వద్ద ఏరోస్పేస్ డిఫెన్స్ క్లస్టర్‌కు వేగంగా అనుమతులు ఇవ్వడాన్ని ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’గా అభివర్ణించారు. అమరావతి నిర్మాణాలపై దుష్ప్రచారాలను ఖండించాలని, ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని మంత్రులకు సూచించారు.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!